
అమరావతి, 29 ఆగస్టు (హి.స.)
హరికృష్ణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సర్మించుకున్నారు. ఈ మేరకు ఎక్స్లో వారు పోస్టు పెట్టారు.
‘నాకు అత్యంత ఆత్మీయుడు, మా బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. రాజ్యసభ సభ్యుడుగా, రాష్ట్ర మంత్రిగా ప్రజాసేవలో అశేష సేవలు అందించిన హరికృష్ణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. సినీ నటుడుగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ