
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-2 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్కుమార్ తెలిపారు. బర్కత్పుర 11 కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, చిక్కడపల్లి,ఆనంద్నగర్ పరిధిలో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, జామై ఉస్మానియా పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు, బౌద్ధనగర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు, విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఏడీఈలు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్