ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 3 నుంచి రిజిస్ట్రేషన్లు
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 3 నుంచి రిజిస్ట్రేషన్లు
Medical council


న్యూఢిల్లీ, 29 ఆగస్టు (హి.స.)

దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) కౌన్సెలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారికంగా ఖరారు చేసింది. ఆల్ ఇండియా కోటా (AIQ), డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) సీట్ల భర్తీకి సంబంధించిన ప్రక్రియ సెప్టెంబర్ 3వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లతో ప్రారంభం కానుంది. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, తమ ప్రాధాన్యతలను బట్టి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఎంసీసీ స్పష్టం చేసింది.

షెడ్యూల్ ప్రకారం.. విద్యార్థులు నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 9న మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. ఈ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంబంధిత కేటాయించిన వైద్య కళాశాలల్లో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గడువు ముగిసేలోగా అవసరమైన ధ్రువపత్రాలు, ఫీజు చెల్లింపు వివరాలతో కాలేజీల్లో చేరాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande