
నేపాల్, 29 ఆగస్టు (హి.స.)
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు (Flash floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విరుచుకుపడిన వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏకంగా 600కి పెరినట్లు నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ (NDRRMA) అధికారికంగా ధ్రువీకరించింది. కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి నివాసాలను ముంచెత్తడంతో భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు, స్థానిక రెస్క్యూ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం తీవ్రమైన గాలింపు చర్యలు జరుగుతుండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరాశ్రయులైన బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ తక్షణ ఆహారం, అత్యవసర వైద్య సదుపాయాలు అందించేందుకు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..