
వేములవాడ, 29 ఆగస్టు (హి.స.) రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ భీమేశ్వర స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఉదయం మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. దర్శనానంతరం వారికి పండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్కుమార్ స్వామివారి శేషవస్త్రంతోపాటు ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కొత్తకొండ వీరభద్రస్వామి వారి నక్షత్రమాల ధరించిన తర్వాత వేములవాడ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఎలాంటి కరవు కాటకాలు లేకుండా ప్రజలంతా పాడి పంటలు, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్