
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం ఈ పరీక్షను ఏటా నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా వందలాది పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో 84 విభిన్న సబ్జెక్టులలో ఈ పరీక్షలు జరిగాయి. లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
తాజా ఫలితాల ప్రకారం, దేశవ్యాప్తంగా వివిధ సబ్జెక్టులలో దాదాపు 4,000 మందికి పైగా అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కు ఎంపికయ్యారు. వీరు దేశంలోని ప్రముఖ వర్సిటీలలో పీహెచ్‌డీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి స్టైపెండ్ పొందేందుకు అర్హత సాధించారు. అలాగే వేలాది మంది అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతం కంటే ఈసారి కట్-ఆఫ్ మార్కులు కొన్ని సబ్జెక్టులలో స్వల్పంగా పెరిగినట్లు విద్యా నిపుణులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi