తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుమల


తిరమల, 29 ఆగస్టు (హి.స.) వరుస సెలవులు, వీకెండ్ కావడంతో తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు, నిన్న ఒక్కరోజే మొత్తం 71,803 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 28,685 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.04 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లలో పర్యవేక్షణను మరింత ముమ్మరం చేసినట్లు దేవస్థానం వర్గాలు పేర్కొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande