దేశవ్యాప్తంగా ఘనంగా 'జాతీయ క్రీడా దినోత్సవం' వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా 'జాతీయ క్రీడా దినోత్సవం' వేడుకలు
modi


హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)

భారత హాకీ దిగ్గజం, హాకీ విజార్డ్ గా పిలవబడే మేజర్ ధ్యాన్ చంద్ 121వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని (National Sports Day) ఘనంగా జరుపుకుంటున్నారు. 1905 ఆగస్టు 29న జన్మించిన ధ్యాన్ చంద్, భారత హాకీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆయన సారథ్యంలో భారత్ 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో వరుసగా మూడు స్వర్ణ పతకాలను సాధించింది. ఆయన వారసత్వాన్ని గౌరవిస్తూ, దేశంలో క్రీడల పట్ల అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా ఈ రోజును క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు.

ఈ ఏడాది ఖేలేగా భారత్, జీతేగా భారత్ (ఆడుదాం భారత్, గెలుద్దాం భారత్) అనే ప్రత్యేక థీమ్‌తో వేడుకలు జరుగుతున్నాయి. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు క్రీడా సంస్థలలో ప్రత్యేక ఫిట్‌నెస్ కార్యక్రమాలు, అవగాహన పరుగు (Run for Fun) నిర్వహిస్తున్నారు. యువతలో శారీరక శ్రమ, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు, క్రీడాకారులకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 'ఖేలో ఇండియా సంవాద్' వంటి కార్యక్రమాలను ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande