
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
ఉజ్బెకిస్థాన్తో భారత్ బంధం మరింత
బలోపేతం అవుతోందిన ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ రాజధాని తష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ (Shavkat Mirziyoyev) తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల దౌత్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నట్లు ఇరు నాయకులు ప్రకటించారు.
చర్చల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నిన్నటి భోజన సమయంలో వ్యక్తిగతంగా ప్రతీ అంశంపై శ్రద్ధ తీసుకుని తనకు అందించిన ఉజ్బెకిస్థాన్ ఆతిథ్యానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రుచికరమైన వంటకాలతో పాటు చిన్న పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ ఉజ్బెకిస్థాన్లోనే భారతదేశాన్ని, నా సొంత రాష్ట్రమైన గుజరాత్ (Gujarat) సంస్కృతిని తన కళ్లముందు సాక్షాత్కరింపజేసినట్లుగా అనిపించింది తెలిపారు. నగరాన్నంతటినీ భారత త్రివర్ణ పతాక వర్ణాలతో అలంకరించిన తీరు తన మనసును స్పృశించిందని భావోద్వేగపూర్తి వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉజ్బెకిస్థాన్ ప్రజల హృదయానికి ఎంత దగ్గరగా ఉందో ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయన ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.మరో రెండు రోజుల్లో ఉజ్బెకిస్థాన్ 35వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా ఆ దేశ ప్రజలకు, అధ్యక్షుడికి ప్రధాని మోదీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15 ఏళ్లు పూర్తవుతున్న శుభ సందర్భంలో, ఇరు దేశాల సంబంధాలను కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ (Comprehensive Strategic Partnership) పెంచడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ఇరు దేశాలు కలసి ముందుకు సాగుతాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..