
తిరుమల, 31 ఆగస్టు (హి.స.)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుకావడంతో భక్తులు కుటుంబ సమేతం తరలివచ్చి స్వామివారిని దర్శించారు. దీంతో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పట్టింది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. మొత్తం 81, 687 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి ఆదాయం కూడా భారీగా పెరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV