విశాఖ.ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
విశాఖ.ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Chandrababu Naidu(file)


అమరావతి, 05 ఆగస్టు (హి.స.)

అమరావతి, ):విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు )ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. రూ.3.50 నుంచి రూ.4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ రంగం నుంచి రూ.5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

బేసిటీ ప్రాజెక్ట్ యాంకర్ ప్రాజెక్టుగా పెట్టుకుని విశాఖపట్నం రీజియన్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సూక్ష్మస్థాయి ప్రణాళిక ద్వారా విశాఖపట్నం రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే వీఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని స్పష్టం చేశారు. వీఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏఐ డేటా సెంటర్ల ఎకో సిస్టం, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీలపై దృష్టి సారించాలని అన్నారు. మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకూ వీఈఆర్ అభివృద్ధిలో భాగంగా ఉండాలని సీఎం సూచించారు.

వివిధ ప్రాజెక్టులను అనుసంధానించటం ద్వారా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిధుల కన్వర్జెన్స్ ద్వారా వీఈఆర్ పరిధిలో అభివృద్ధి చేపట్టాలని సూచించారు. అవసరమైన మేరకు వీజీఎఫ్ స్కీంను అమలు చేయాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande