రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఎనిమిది ప్రైవేటు కాలేజీలు.. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్వోసీలను(NOC) సృష్టించిన కళాశాలలు.. వాటిని ఇంటర్మీడియట్ బోర్డు
Hydra


హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.) హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఎనిమిది ప్రైవేటు కాలేజీలు.. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్వోసీలను(NOC) సృష్టించిన కళాశాలలు.. వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు.

దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన ఎనిమిది ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande