
నంద్యాల జిల్లా,, 05 ఆగస్టు (హి.స.)
:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ )ఆదేశాలతో పులుల మరణాలపై అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో ఆత్మకూరు అటవీ శాఖ డివిజన్లో ఓ వ్యక్తి వద్ద పులి గోర్లను అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని రహస్యంగా ఫారెస్ట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసు విచారణ అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పులుల మరణాలపై విచారణకు ప్రత్యేక బృందాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ