తెలంగాణలో సాగు, తాగునీటిని దూరం చేసేందుకు కుట్ర: హరీశ్రావు
తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలను పణంగా పెట్టేలా ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
Harish rao


హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.) తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలను పణంగా పెట్టేలా ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్రావు (Harishrao) ప్రశ్నించారు. ఈనెల 18న జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఏపీ ప్రయోజనాల కోసం జరుగుతున్నట్లు ఉందని ఆరోపించారు. తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆ రాష్ట్రం ప్రతిపాదించిందన్నారు. అజెండా ఖరారై వారం రోజులైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో సాగు, తాగునీటిని దూరం చేసే కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం అనుమతులు రద్దు అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడమే. ఏపీ ప్రతిపాదనలను అజెండాలో చేర్చే ముందు తెలంగాణను సంప్రదించరా? జీఆర్ఎంబీలో ఉన్న రాష్ట్ర ఇంజినీర్లు మౌనంగా ఎందుకు అంగీకరించారు?సీఎం రేవంత్రెడ్డి దీనికి పరోక్షంగా అంగీకారం తెలిపారా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కిషన్రెడ్డి, బండి సంజయ్కు లేదా? తెలంగాణ భాజపా ఎంపీలు రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ముందుకు వస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం నుంచి అనుమతి తేలేదు’’ అని హరీశ్రావు విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande