
హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్లో ఇంటర్ కాలేజీల ఫోర్జరీ బాగోతం కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.
ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం నకిలీ ఎన్వోసీల కోసం 8 ఇంటర్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయగా అదే బాటలో మరికొన్ని కాలేజీలు ఫైర్ డీజీ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తాజాగా అధికారులు గుర్తించారు. ప్రస్తుత ఆర్టీసీ ఎంపీ గతంలో అగ్నిమాపక శాఖలో డీజీగా పని చేశారు. అయితే ఆయన బదిలీ అయినప్పటికీ కొన్ని కాలేజీలు ఫైర్ డిపార్ట్ మెంట్ ఎన్వోని నాగిరెడ్డి పేరుతో ఇంటర్ బోర్డుకు సమర్పించి అనుమతులు సాధించినట్లు అధికారులు గుర్తించారు. ఫైర్ డిపార్ట్ మెంట్లోనాగిరెడ్డి లేకపోయినా ఆయన సంతకాలతో ఎన్ఏసీలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టగా నాగిరెడ్డి పేరుతో నకిలీ ఎన్బీసీ వ్యాహరం బయటపడింది. మొత్తం 8 కాలేజీలు నాగిరెడ్డి పేరుతో నకిలీ ఎన్ఎసీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..