నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రధాన రోడ్డు పనులను వేగవంతం చేయాలి.. మంత్రి వివేక్
నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రధాన రోడ్డు పనులను వేగవంతం చేయాలి.. మంత్రి వివేక్
Minister


మంచిర్యాల, 05 ఆగస్టు (హి.స.)

నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రధాన

రోడ్డు పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారి రోడ్డు పనులను ఆయన స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని రోడ్లు డ్రైనేజీ పనులు పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. వార్డులలో అధికారులు పర్యటిస్తూ సమస్యలను గుర్తించి ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తి చేయాలని ఆయన అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande