ఎస్ఆర్ఆ ప్రక్రియను నిష్పాక్షికంగా నిర్వహించాలి.. ములుగు జిల్లా కలెక్టర్
ఎస్ఆర్ఆ ప్రక్రియను నిష్పాక్షికంగా నిర్వహించాలి.. ములుగు జిల్లా కలెక్టర్
Collector


ములుగు, 05 ఆగస్టు (హి.స.)

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం నియమావళిని కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో ప్రస్తుతం 303 పోలింగ్ కేంద్రాలు ఉండగా నూతనంగా మరో ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పోలిక్ కేంద్రంలో సంఖ్య 308 కి పెరుగనున్నదని వివరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో కీలకమని, ఎస్ఐఆర్-2026 ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు అందలేదని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, సలహాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీఓ కె. కృష్ణవేణి, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande