తెలంగాణ ‘పెట్టుబడులకు అనుకూలం’
భూ లభ్యత, నైపుణ్య మానవ వనరులు, మౌలిక వసతులు ప్రధాన బలాలు ప్రతికూలంగా ఆర్థిక, సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా 13వ స్థానం 17 పెద్ద రాష్ట్రాల విభాగంలో 10వ ర్యాంకు నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్-2026 నివేదికలో వెల్లడి.
Investment


హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.) పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్-2026 నివేదికలో.. రాష్ట్రం 47.3 పాయింట్లతో దేశవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. 17 పెద్ద రాష్ట్రాల విభాగంలో 10వ ర్యాంకు సాధించింది. పెట్టుబడులకు అనుకూల సూచికల్లో గుజరాత్ (56.6) మొదటి స్థానంలో నిలవగా.. మహారాష్ట్ర (53.7), తమిళనాడు(53.3), గోవా(53.1), ఒడిశా(52.4) రాష్ట్రాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ సూచీలో చేర్చారు. మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, వనరుల లభ్యత, ప్రభుత్వ విధానాలు.. ఇలా 8 ప్రధాన అంశాల ప్రాతిపదికన, మొత్తం 84 సూచికల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇందులో ప్రభుత్వ గణాంకాలతో పాటు.. పెట్టుబడిదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు.

తెలంగాణకున్న ప్రధాన సానుకూల అంశాలు

తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రాల్లో ఒకటిగా ఈ నివేదిక గుర్తించింది. టీజీ-ఐపాస్ వల్ల ‘రెగ్యులేటరీ ఈజ్’ విభాగంలో మెరుగైన స్కోరును సాధించింది. 2023-24లో ఎఫ్డీఐ పెట్టుబడులు 3,029.07 మిలియన్ అమెరికన్ డాలర్లు వచ్చాయి.

1. టీజీ-ఐపాస్ అతిపెద్ద బలం

2. పరిశ్రమలకు సమృద్ధిగా భూమి లభ్యత

దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాల సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించడానికి అందుబాటులో ఉన్న భూమి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది.

3. పన్నుల ఆదాయం భేష్

4. నైపుణ్య మానవ వనరులు

5. వేగంగా న్యాయ వివాదాల పరిష్కారం

ప్రధాన ప్రతికూల అంశాలు

ఇన్స్టిట్యూషనల్ ఎన్విరాన్మెంట్ స్కోరుపై ఆర్థిక, సైబర్ నేరాలు ప్రతికూల ప్రభావం చూపాయి. వాటి నియంత్రణ, ఎంఎస్ఎంఈలకు మరింత సులభతరమైన వ్యవస్థలు, భారీ ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతుల ప్రక్రియ వంటి అంశాల్లో సంస్కరణలు చేపడితే.. దేశంలోని అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానాల జాబితాలో తెలంగాణ టాప్ 10లో నిలిచే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

1. ఆర్థిక, సైబర్ నేరాలు..

2. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

3. టీజీ-బీపాస్

4. ఎంఎస్ఎంఈలు...

5. ఆటోమొబైల్ రంగం

6. శాఖల మధ్య సమన్వయం

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande