
గుంటూరు, 06 ఆగస్టు (హి.స.)
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అంబటి అసత్య ప్రచారం చేశారంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. రాజకీయ విద్వేషాలు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వీడియో పోస్ట్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నేత ఫిర్యాదుతో అరండల్ పేట పోలీస్స్టేషన్లో అంబటిపై కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 356, 353, 352, 61(2), 3(5) BNS కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదే వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఫిక్షన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ రెండు కేసులకు సంబంధించి అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ