గతేడాది కర్నూలు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదం పై. జిల్లా ఎస్పీ కి నోటీసులు
గతేడాది కర్నూలు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదం పై. జిల్లా ఎస్పీ కి నోటీసులు
గతేడాది కర్నూలు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదం పై. జిల్లా ఎస్పీ కి నోటీసులు


కర్నూలు, 06 ఆగస్టు (హి.స.)

గతేడాది కర్నూలు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి.. తీసుకున్న చర్యలను వివరిస్తూ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR)ను నాలుగు వారాల్లో తమకు నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ.. క జిల్ర్నూల ఎస్పీ.కి నోటీసులు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని.. ఎన్హెచ్ఆర్సీకి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధితులకు కల్పించిన రక్షణ చర్యలు, అధికార యంత్రాంగం స్పందినతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర విచారణ జరపాలని అందులో పిటిషనర్ కోరారు. దీనిపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. అలాగే ఈ కేసు దర్యాప్తులో పురోగతి, బాధితుల కుటుంబాలకు అందించిన సహాయం, ఈ ఘటనకు బాధ్యులపై తీసుకున్న చర్యలు, బాధితులకు అందిన సాయంతో పాటు ప్రజా రవాణా భద్రత కోసం అమలు చేస్తున్న వివరాలను కూడా ఆ నివేదికలో పొందుపర్చాలని కర్నూలు జిల్లా ఎస్పీకి ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.

గతేడాది అక్టోబర్ 24వ తేదీన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande