
గుంతకల్లు(అనంతపురం), 06 ఆగస్టు (హి.స.)
:ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-జైపూర్ ప్రత్యేక వీక్లీ (06181) రైలును ఈనెల 13వ తేదీ నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకూ బుధవారాలలో నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైలు పేర్కొన్న తేదీల మధ్య గురువారాలలో నాలుగు ట్రిప్పులు నడుస్తుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (06182)ను ఈ నెల 16 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకూ ఆదివారాలలో నాలుగు ట్రిప్పులు నడపనున్నట్లు తెలిపారు.
ఈ రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముడ్ఖేడ్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూర్ణా, హింగోలి డెక్కన్, వాసిం, అకోలా, మల్కాపూర్, భూసావల్, జల్గావ్, ధరన్గావ్, ఉడ్నా, భరుచ్, వడోదర, గోద్రా, రత్లం, జవోరా, మండ్సోర్, నిమచ్, ఛత్తీస్ఘడ్, భిల్వారా, బిజయ్నగర్, నాసిరాబాద్, అజ్మీర్, కిషన్గర్ స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ