ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగతా రోజులు ప్రజాసేవే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగతా రోజులు ప్రజాసేవే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
Mla


కరీంనగర్, 06 ఆగస్టు (హి.స.)

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని, మిగిలిన సమయంలో ప్రజాసేవే అందరి ధ్యేయంగా ఉండాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ప్రత్యేక అధికారి ఎం. అనిల్ ప్రకాష్ కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వివిధ గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలకు, వర్గాలకు అతీతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మండలంలోని సమస్యలను శాఖల వారీగా నివేదికల రూపంలో సిద్ధం చేసి, వాటిని ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande