28 కిలోల గంజాయిని పట్టుకున్న నర్సంపేట పోలీసులు. ఇద్దరు అరెస్ట్
28 కిలోల గంజాయిని పట్టుకున్న నర్సంపేట పోలీసులు. ఇద్దరు అరెస్ట్
Ganja


నర్సంపేట, 06 ఆగస్టు (హి.స.)

బొలెరో వాహనంలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని నర్సంపేట పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి భద్రాచలం- మహబూబాబాద్ -నర్సంపేట మీదుగా హైదరాబాద్కు గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్సై అరుణ్ తన సిబ్బందితో మహబూబాబాద్ రోడ్ వైపున మాటు వేశారు. అనుమానాస్పదంగా ఉండటంతో వాహనాన్ని తనిఖీ చేశారు. ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా ఇద్దరిని పట్టుకున్నారు. ఒకరు పరారైనట్లు సమాచారం. బొలెరో వాహనం కింది భాగంలో ప్రత్యేక బాక్సులను అమర్చి గంజాయిని అందులో పెట్టి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తహసీల్దార్ సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాళ్లను అమృత బైద్యాయ్, పుజూర్ రాయ్, మల్కనగిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రంగా గుర్తించారు. వీరి నుంచి రూ. 14 లక్షల విలువ చేసే 28 కేజీల ఎండు గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బొలెరో వాహనం ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande