నిజామాబాద్ ఇంచార్జి కలెక్టర్గా భవేష్ మిశ్రా బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ ఇంచార్జి కలెక్టర్గా భవేష్ మిశ్రా బాధ్యతల స్వీకరణ
Collector


నిజామాబాద్, 06 ఆగస్టు (హి.స.)

నిజామాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10:45 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న ఆయనకు అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఎ గీతతో పాటు ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నేరుగా తన చాంబర్కు చేరుకున్న భవేష్ మిశ్రా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇంచార్జి కలెక్టర్ అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande