తిరుపతి నగరంలోని.అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనోవిజన్ షాపులో భారీ చోరీ
తిరుపతి నగరంలోని.అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనోవిజన్ షాపులో భారీ చోరీ
తిరుపతి నగరంలోని.అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనోవిజన్ షాపులో భారీ చోరీ


తిరుపతి, 08 ఆగస్టు (హి.స.)

,:నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనోవిజన్ షాపులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 50 యాపిల్ ఐఫోన్లు, ఇతర కంపెనీలకు చెందిన మరో 200 సెల్ ఫోన్లతోపాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు. శనివారం ఉదయం షాపు తెరిచి లోపలికి వెళ్లిన సిబ్బందికి.. వస్తువులు చోరీ అయినట్లు గుర్తించారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోనోవిజన్ షాపుతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన వస్తువుల విలువ దాదాపు రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో షాపు సిబ్బంది స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande