
ఇండోర్, 08 ఆగస్టు (హి.స.)
ఐక్య స్వరమే బలమైన భవిష్యత్తు అని సుప్రీంకోర్టు సీజేఐ సూర్య కాంత్ (CJI Surya Kant) అన్నారు. ఈ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో నిర్వహించిన 'పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సు' (West Zone Regional Conference) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సదస్సుకు విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల (DLSA) సభ్య కార్యదర్శులు, లీగల్ ఎయిడ్ కమిటీల సభ్యులు మరియు పారా లీగల్ వాలంటీర్లకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సదస్సు కోసం ఎంచుకున్న 'యునైటెడ్ వాయిస్, స్ట్రాంగర్ టుమారో' (ఐక్య స్వరం - బలమైన భవిష్యత్తు) అనే నేపథ్యం ఎంతో అర్థవంతమైనదని సీజేఐ కొనియాడారు. ఈ ఇతివృత్తం 'సంభాషణ (Dialogue), ఆత్మగౌరవం (Dignity), సమ్మేళనం/అందరినీ కలుపుకుపోవడం (Inclusion)' అనే మూడు కీలకమైన పదాల పునాదిపై ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు సులభంగా న్యాయం అందించడానికి ఈ రకమైన చర్చలు, సమావేశాలు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..