
ముంబై, 08 ఆగస్టు (హి.స.) భారత్లో పసిడి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ వారంలో ఇప్పటివరకూ బంగారం ధర 7 శాతం మేర పెరిగింది. ఒక్క వారంలో ధరలు ఇంతలా పెరగడం జనవరి తరువాత ఇదే మొదటిసారి. యూఎస్ కీలక వడ్డీ రేట్ల పెంపు ఉండదన్న అంచనాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లకు దిగుతుండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (ఆగస్టు 8) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900గా ఉంది. 22 క్యారెట్లు బంగారం ధర రూ.1,37,410గా ఉంది. 18 క్యారెట్లు పసిడి రూ.1,12,430 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,005 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,560 వద్ద ట్రేడవుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా పరుగులు పెడుతోంది. కాకపోతే స్వల్పంగానే పెరుగుతోంది. అంటే గత వారంలో కిలో వెండి ధర రూ.2,34,000 వద్ద ఉండగా, ఇప్పుడు రూ.2,39,900 వద్ద ట్రేడవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV