
తిరుమల, 09 ఆగస్టు (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. ఉదయం 7 గంటల సమయానికి ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ క్యూ లైన్లో భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. 8 గంటల తర్వాతి నుంచి క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు సర్వదర్శనానికి 20-24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5-7 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (శనివారం) స్వామివారిని 87,658 మంది భక్తులు దర్శించుకోగా.. 40,606 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు సమకూరింది. భక్తులకు 4.15 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. 3.09 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV