
అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పరిధిలోని టిడ్కో గృహాల వద్ద డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
అసాంఘిక కార్యకలాపాలతోపాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి ధ్రువ పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను గుర్తించడంతోపాటు ఒక ఆటోను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ