
అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
కృష్ణా జిల్లా యనమలకుదురులో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడ సిటీ ఏఆర్ విభాగానికి చెందిన హెచ్ కానిస్టేబుల్ ఆర్లు రాజేశ్.. 2009 బ్యాచ్ ఉద్యోగి.
ప్రస్తుతం ఆయన ఆర్డర్ టు సర్వ్పై కృష్ణా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ