
అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని 22ఎలో పెడితే ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.
గురువారం అమరావతిలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏదైనా భూమిని 22ఎ జాబితాలో చేర్చేందుకు విధివిధానాలను స్పష్టం చేస్తూ జీవో నెం.445 ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. ఈ జీవో ప్రకారం ఏదైనా ప్రైవేట్ భూమిని 22ఎ జాబితాలో పెట్టాలంటే ఆ అధికారే దాన్ని నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కక్ష పూరితంగా 22ఎలో చేర్చిన 28 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించామని గుర్తు చేశారు. ఈ జీవో వచ్చిన తర్వాత 28,790 ఎకరాలను తొలగించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో1,100 ఎకరాలను తొలగించామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ