విజయనగర.జిల్లా.కేంద్రంలో వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాల పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్
విజయనగరం జిల్లా కేంద్రంలో వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనదారులపై గురువారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
విజయనగర.జిల్లా.కేంద్రంలో వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాల పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)

విజయనగరం జిల్లా కేంద్రంలో వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనదారులపై గురువారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

వాహనాలపై నంబర్ ప్లేట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండటం తప్పనిసరి అని సీఐ ఎస్.రాము సూచించారు. నంబర్ ప్లేట్ను వక్రీకరించడం, అంకెలను మార్చి చూపించడం, ఫ్యాన్సీ/అస్పష్టమైన నంబర్ ప్లేట్లు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మోటార్ వెహికల్స్ చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. వాహనదారులు తమ వాహనాలకు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నంబర్ ప్లేట్ను ఎలాంటి మార్పులు చేయకుండా స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande