ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
Collector


ఆదిలాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

గురువారం ఉట్నూర్ సబ్కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ ఇన్చార్జి పీఓ ప్రణయ్కుమార్తో కలిసి మండలంలోని నర్సాపూర్ (బి) గ్రామపంచాయతీని కలెక్టర్ సందర్శించారు. గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముక్తి బిజిలీ యోజనలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

అనంతరం గ్రామంలోని ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, భోజనం, వసతి సౌకర్యాలపై పాఠశాల హెచ్ఎం రాథోడ్ ప్రకాష్ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం గ్రామస్తులతో సమావేశమైన కలెక్టర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్ధిదారులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande