
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)
దేశంలోనే మోడల్ విలేజ్ అయిన
ఆర్మూర్ లోని అంకాపూర్ గ్రామంలో ఆర్మూర్ ప్రాంతంలోని అభ్యుదయ రైతుల కోసం, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసూళ్లతో మోడల్ కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు.
గురువారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ లో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హార్టికల్చర్ అంశంపై మాట్లాడారు. అంకాపూర్ గ్రామంలో మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి పండించిన కూరగాయలు మార్కెట్ కు తీసుకువచ్చే రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించి మోడల్ కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయని, అలాగే ఉదయం రెండు గంటల నుంచి రైతులు కూరగాయల విక్రయాల కోసం పడిగాపులు కాస్తారని, మార్కెట్లో వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్కెటింగ్ శాఖ ద్వారా ఆ సమస్యలను తీర్చాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.
అంకాపూర్ లో మొక్కజొన్న అమ్మకాలు ఏడాది పొడుగున జరుగుతాయని అంకాపూర్ అంటే దేశంలోనే ఆదర్శ గ్రామమని ప్రత్యేక గ్రాంట్ ద్వారా ఏడాదికి 5 లక్షల నిధులు అభివృద్ధికి వస్తాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు