
తెలంగాణ , 10 సెప్టెంబర్ (హి.స.)బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భద్రత పై ఎఫ్డీసీ మాజీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై తక్షణమే జోక్యం చేసుకోవా లని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు, పరిపాలనా యంత్రాంగాన్ని ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అమానుషంగా దాడులు చేయడంతో పాటు, అరెస్టులు, నిర్బంధాలు వంటి ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్