22ఏ భూములపై రచ్చ.. మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్
తెలంగాణ శాసనమండలిలో 22ఏ నిషేధిత భూముల వివాదంపై తీవ్ర గందరగోళం నెలకొంది.
Council


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ శాసనమండలిలో

22ఏ నిషేధిత భూముల వివాదంపై తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే 22ఏ భూములకు సంబంధించిన సమస్యలపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.

అయితే మండలి చైర్మన్ ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో సభ జరుగుతున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ మండలి నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయింది.

ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. శాసనమండలిలో మార్షల్స్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. అంతుక ముందు సభను సజావుగా సాగనివ్వాలని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చుని సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ నేతలు శాంతించలేదు. తమ ఆందోళనను కొనసాగిస్తూనే, సభ జరుగుతున్న తీరుపై నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande