
ఢిల్లీ , 10 సెప్టెంబర్ (హి.స.)సెప్టెంబర్ 11 శుక్రవారం నుంచి సెప్టెంబర్ 14 సోమవారం వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 11 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టనుంది. ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 12 రెండో శనివారం, సెప్టెంబర్ 13 ఆదివారం సాధారణ సెలవులు. ఇక సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలన్నది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్గా ఉంది. దీనిపై 2024 లోనే సూత్రప్రాయ అంగీకారం కుదిరినప్పటికీ.. అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. దాంతోపాటు సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని సమీక్షించాలని, పెన్షన్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్