ప్రభుత్వ భూముల లెక్క తేల్చాలి...... సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని నిరుపయోగ ప్రభుత్వ భూములన్నింటి లెక్క తేల్చి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
AP CM


ఆంధ్రప్రదేశ్ , 10 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలోని నిరుపయోగ ప్రభుత్వ భూములన్నింటి లెక్క తేల్చి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టు మంజూరయ్యాక భూమి కోసం వెతకుండా ముందుగానే ల్యాండ్ ను గుర్తించి సిద్ధంగా ఉంచేలా వ్యవస్థను మార్చాలని స్పష్టం చేశారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పై సమీక్షలో బుడగ జంగాలకు ఎస్సీల ప్రయోజనాలు, నైపుణ్యాభివృద్ధి, గృహాల నిర్మాణం, తాగునీటి అత్యవసర పనులు, 50 శాతం హరిత ప్రాంతం లక్ష్యంగా మొక్కల పెంపకం సహా పలు అంశాలను వేగంగా అమలు చేయాలని సీఎం తేల్చి చెప్పారు.ప్రతి శాఖ, ప్రతి జిల్లాకు మూడు నెలల యాక్షన్ క్యాలెండర్ రూపొందించి గడువులోగా ఫలితాలు సాధించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande