
నాగర్ కర్నూల్, 10 సెప్టెంబర్ (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో కరెంటు కోతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,ఇచ్చిన మాటలను గాలికి వదిలి, రోజురోజుకు కరెంటు కోతలు విధిస్తూ రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. కరువుతో అల్లాడుతున్న రైతులు పంటలు ఎండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
వీరికి మద్దతుగా ఎట్టి ఆంజనేయులు బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జీ బొట్టె మల్లయ్య, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రైతులు నిర్వహిస్తున్న ధర్నా లో పాల్గొన్నారు. జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు