అనకాపల్లిలో భారీ వర్షం
అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది.
Rain


ఆంధ్రప్రదేశ్ , 10 సెప్టెంబర్ (హి.స.) అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వేసవి తాపంతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న స్థానిక ప్రజలను ఈ వర్షం పలకరించింది. వాన కారణంగా పలుచోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. మరియు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని జిల్లాల్లో రానున్న కొద్ది రోజుల పాటు వాతావరణం చల్లబడనుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande