జడ్చర్ల పాత బస్టాండ్కు పూర్వవైభవం : ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ను అన్ని సౌకర్యాలతో పునరుద్ధరించి, అక్కడి నుంచి యథావిధిగా బస్సుల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.
MLAMLA


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత

బస్టాండ్ను అన్ని సౌకర్యాలతో పునరుద్ధరించి, అక్కడి నుంచి యథావిధిగా బస్సుల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. జడ్చర్ల మున్సిపాలిటీలో రెండు బస్టాండ్లు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఒకటి జాతీయ రహదారి-44 సమీపంలోని కొత్త బస్టాండ్ కాగా, మరొకటి పాత బజార్లోని పాత బస్టాండ్ అని పేర్కొన్నారు. కొత్త బస్టాండ్ ప్రాంతంలో గతంలో బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటనను ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ సర్వైలెన్స్ ఉండటంతో పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకోగలిగారని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా కొత్త బస్టాండ్ పరిసరాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అత్యవసరమని ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా, ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన జడ్చర్ల పాత బస్టాండ్కు ప్రస్తుతం బస్సుల రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. పాత బజార్ ప్రాంత ప్రజలు బస్సు ఎక్కేందుకు మెయిన్ రోడ్డుకు వెళ్లాల్సి రావడంతో అదనంగా ఆటో చార్జీలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాత బస్టాండ్ పునరుద్ధరణపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande