ఉచిత బస్సు పథకం ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఆగ్రహం
కేరళ రాష్ట్రంలో ప్రైవేట్ బస్ ఆపరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పట్ల ప్రైవేట్ బస్ ఆపరేటర్లు నిరాశ చెందుతున్నారు.
KSRTC


ఢిల్లీ , 10 సెప్టెంబర్ (హి.స.) కేరళ రాష్ట్రంలో ప్రైవేట్ బస్ ఆపరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పట్ల ప్రైవేట్ బస్ ఆపరేటర్లు నిరాశ చెందుతున్నారు.

తమను ఆదుకోకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కేఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ఈ పథకం కారణంగా తాము తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయామని, జూన్ 15 నుంచి రూ.120 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వాపోయారు.

మహిళా ప్రయాణికులు లేక బస్సులను నష్టాలతో నడుపుతున్నామని వారు తెలిపారు. తమను ఆదుకునేందుకు టికెట్ చార్జీలు పెంచాలని, డీజిల్లో సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఇటీవల లీటర్ డీజిల్ రూ.8.50 పెరిగిందని, దానికి తోడు ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని భారీగా పెంచారని, సిబ్బందికి సరిగా వేతనాలు కూడా ఇవ్వలేక పోతున్నామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande