అర్హులైన అందరికీ పింఛన్లు.. మంత్రి సీతక్క
అర్హులైన దివ్యాంగుల నుంచి పింఛన్ కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోందని ఈ దరఖాస్తులకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని మంత్రి సీతక్క వెల్లడించారు.
Seethakka


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

అర్హులైన దివ్యాంగుల నుంచి

పింఛన్ కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోందని ఈ దరఖాస్తులకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని మంత్రి సీతక్క వెల్లడించారు.

రాష్ట్రంలో 4,66,351 మంది దివ్యాంగుల పింఛన్ పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు దివ్యాంగుల కేటగిరీ కింద 1,23,199 దరఖాస్తులు వచ్చాయని ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అర్హత గలవారికి పింఛన్ల పంపిణీ చేస్తామన్నారు.

ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి.. తాము వచ్చా తల సేమియా పేషంట్లకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని వెల్లడించారు.

సదరం సర్టిఫికేషన్లు రెన్యువల్ చేసుకోకపోవడం వల్లే కొందరికి పింఛన్లు రావడం లేదన్నారు. అర్హత కలిగిన వారు తమ సదరం సర్టిఫికేట్లు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande