గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి
భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోచంపల్లి పోలీసులు సూచించారు.
Police


నల్గొండ, 10 సెప్టెంబర్ (హి.స.)

భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోచంపల్లి పోలీసులు సూచించారు.

గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో వివిధ స్వచ్ఛంద, యువజన సంఘాల నాయకులు, గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి,రహదారులపై ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని,వీలైతే ప్రతి మండపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande