
పనాజీ, గోవా, 10 సెప్టెంబర్ (హి.స.)
ముంబై-గోవా రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఆలస్యంపై తాను సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. అందుకే ఆ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోనని ఆయన అన్నారు. (Nitin Gadkari) గోవా రాజధాని పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ వద్ద ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్ కారిడార్ను కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్, రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి దిగంబర్ కామత్, పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఫౌంటే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. ముంబై-గోవా రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ముంబై-గోవా హైవే పనులు ఇంత ఆలస్యం కావడం నాకు సిగ్గుగా అనిపించింది. అందుకే దాని ప్రారంభోత్సవానికి నేను రానని ముందే ప్రకటిస్తున్నా' అని అన్నారు.
మరోవైపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యం, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు చేపడతానని నితిన్ గడ్కరీ హెచ్చరించారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..