తిరుపతి విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం
తిరుపతి–విజయవాడ మధ్య ఫ్లై91 వి మాన సర్వీసు ప్రారంభమైంది. గన్నవరం విమానాశ్రయంలో విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి ఈ సర్వీసును ప్రారంభించారు.
Flight

అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)

తిరుపతి–విజయవాడ మధ్య ఫ్లై91 వి మాన సర్వీసు ప్రారంభమైంది. గన్నవరం విమానాశ్రయంలో విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి ఈ సర్వీసును ప్రారంభించారు.

తొలి ప్రయాణికులకు ఆయన స్వయంగా టికెట్లు అందజేశారు. వారంలో నాలుగు రోజుల పాటు తిరుపతి–విజయవాడ మధ్య ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి రావడం ద్వారా విజయవాడ, తిరుపతి మధ్య ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande