
ఆంధ్రప్రదేశ్ , 10 సెప్టెంబర్ (హి.స.)విజయవాడకు చెందిన యువతి శాస్త్రీయ నృత్యం మరియు మార్షల్ ఆర్ట్స్ రెండు విభిన్న రంగాల్లో సత్తా చాటుతుంది. చిన్న వయసు నుంచే కూచిపూడిలో వందలాది ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్లో అద్భుత ప్రతిభ చూపిస్తున్న ఈ అమ్మాయి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకుంది. అంతేకాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది. కళలపై ఉన్న ఆసక్తికి క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైతే ఎలాంటి విజయాలైనా సొంతమవుతాయంటున్న విజయ హాసినిపై కథనం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్