రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్
నగరంలోని ప్రతిష్టాత్మక మద్రాస్ రెజిమెంట్ కేంద్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. మిలిటరీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ కేసు గత నెల 30వ తేదీన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Weapons


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

నగరంలోని ప్రతిష్టాత్మక మద్రాస్ రెజిమెంట్ కేంద్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. మిలిటరీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ కేసు గత నెల 30వ తేదీన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఆయుధాల అదృశ్యం వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. ఈ దొంగతనం ఒక్క రోజులో జరిగినది కాదని, గడిచిన మూడు నెలల కాలంలో పథకం ప్రకారం ఒక్కో ఆయుధాన్ని చాకచక్యంగా మాయం చేసినట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించినట్లు సమాచారం అందుతుంది.

ఆయుధాగారం (ఆర్మరీ) వద్ద ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీటీవీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆపేసి, అక్కడ విధుల్లో ఉన్న భద్రతా గార్డులను వేర్వేరు పనుల నిమిత్తం బయటకు పంపించి ఆయుదాలను తరలించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. చివరకు ఈ మొత్తం వ్యవహారాన్ని బయట వ్యక్తులు, దొంగలు చేసిన పనిగా చిత్రీకరించేందుకు చివరి రోజున తాళాలు పగలగొట్టి డ్రామా ఆడినట్టు సమాచారం. కాగా ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం తెలియాలంటే ఆర్మీ అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande