ప్లాస్టిక్ నిషేధంపై మార్కాపూర్లో విద్యార్థుల భారీ ర్యాలీ!
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్కాపూర్ పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
huge-plastic-ban-awareness-rally-by-students-in-markapu


మార్కాపూర్, 10 సెప్టెంబర్ (హి.స.) పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్కాపూర్ పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

కమల జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కమల, గౌతమి, సిద్ధార్థ, వాగ్దేవి జూనియర్ కాలేజీల విద్యార్థులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీలో పాల్గొని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని నినాదాలు చేశారు.

రాబోయే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రోగ్రాం మార్గదర్శకులు గైకోటే వెంకట రవి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో FRO పిచ్చి రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది విద్యార్థులతో కలిసి పాల్గొని ప్రోత్సహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande