ఇంటింటి చెత్త సేకరణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు- కమిషనర్ చల్లా ఓబులేసు
ఇంటింటి చెత్త సేకరణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు- కమిషనర్ చల్లా ఓబులేసు
kurnool-municipal-commissioner-directs-100-garbage-collection-1


కర్నూలు, 10 సెప్టెంబర్ (హి.స.)కర్నూలు నగరంలోని 137 సచివాలయాల పరిధిలో 100% ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన విద్యుత్ ఆటోలను సమర్థవంతంగా వినియోగించుకునేలా పిన్ పాయింట్ ప్రోగ్రామ్ను పక్కాగా రూపొందించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పారిశుద్ధ్య పర్యవేక్షక యంత్రాంగాన్ని ఆదేశించారు.

స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఈ-ఆటోలు కేటాయించిన పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈ-ఆటోలకు కేటాయించిన మైక్రో పాకెట్ల పరిధిలో ప్రతి ఇంటి నుంచి చెత్తను 100 శాతం సేకరించేలా సచివాలయ కార్యదర్శులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి వాహనం తనకు కేటాయించిన ప్రాంతంలో పూర్తిస్థాయిలో తిరిగేలా పిన్ పాయింట్ ప్రోగ్రామ్ను రూపొందించుకోవాలని సూచించారు.

ఈ-ఆటో డ్రైవర్ సెలవు కారణంగా విధులకు గైర్హాజరైనా లేదా వాహనం మరమ్మత్తులకు గురైన చెత్త సేకరణకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే సిద్ధంగ చేసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

నగరంలో 100% ఇంటింటి చెత్త సేకరణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే విధంగా సచివాలయ కార్యదర్శులు, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ-ఆటోల ద్వారా చెత్త సేకరణ వ్యవస్థను మరింత పటిష్టం చేసి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు.

సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, వాహనాల ఇన్చార్జి కురుబ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande